మహబూబాబాద్ జిల్లా :కేసముద్రం వ్యవసాయ మార్కేట్ లో మాజీ మంత్రి హరీశ్ రావు రైతుల్ని పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంట దాకా అన్నీ సమస్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సమయానికి ఎరువులందవు, కరెంటు సరిగ్గా రాదు, రైతుబంధు రాదు, రుణమాఫీ లేదు, బోనస్, పంటల బీమా ఊసేలేదని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క హామీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లు, కార్పొరేట్లకు లాభం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి మేలుకోకపోతే తెల్ల బంగారం పత్తిని తెచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ని హరీశ్ రావు సందర్శించారు. పత్తి రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, బీజేపీ తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
రైతులకు బోనస్ ఎగ్గొట్టిన గొప్ప పాలకుడు రేవంత్ రెడ్డి.
రైతులకు యూరీయా లేకుండ చేసిన ఘనత ఈ కాంగ్రేస్ ప్రభుత్వానిదే.
1500 రూపాయాలు పెట్టి రైతులు యూరీయా కొంటె కనీసం మంచి ధర రైతులకు రావడం లేదు.
కాంగ్రేస్ పాలనతో దళారులు ఎక్కువ అయ్యారు.
రైతులు రేవంత్ రేవంత్ ప్రబుత్వం మిద శాపనార్ధాలు పెడుతున్నరు.
కేసముద్రం వ్యవసాయ మార్కేట్ గొప్ప మార్కేట్.
పత్తి కొనే నాధుడే లేడు.
మక్కలు అమ్మి నెల రోజులు అవుతున్న రైతులకు డబ్బులూ రాని దుస్థితి.
రాష్ట్రంలో 2000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.
వ్యవసాయ శాఖ మంత్రి స్పందించి రైతులకు కొనుగోలు డబ్బులు, యసంగి బొనస్ వెంటనె ఇవ్వాలి.
జూబ్లీ హిల్స్ లో కూర్చొని డబ్బులూ పంచడం కాధు రైతుల పంటల కొనుగోలుకు డబ్బులూ ఇవ్వండి.
మార్కేట్ లొ దుర్భర పరిస్థితులు ఉన్నాయి.
మొన్నటి వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. నష్ట పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు.
సీతారాం తాండ లొ ఓక్క ఇల్లు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గిరిజనులనూ మోసం చేసాడు.
పంటల బీమా అమలు కాలెదు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలొ డాక్టర్ల కొరత,మన ఊరు మన బడి పథకాన్ని అపి పేదలకు విద్యను దూరం చేసిన పాలకుడు రేవంత్ రెడ్డి.
ఇంటర్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మహబూబాబాద్ ప్రభుత్వా దవాఖానలో బతికి ఉన్న మనిషిని మార్చురిలో వేసిన గొప్ప పాలన ఈ రేవంత్ ది అన్నరు..
కాంగ్రేస్ పాలనలొ రొడ్ల మిద తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదు.
మహబూబాబాద్ జల్లాలో మెడికల్, హార్టీ కల్చర్ కళాశాల, ఇంజనిరింగ్ కళాశాలలో వసతులు. లేక విద్యార్థులు ఇబ్బందులు. పాడుతున్నారు.
6నేలల నుండీ అసెంబ్లీ సమావేశాలు పెట్టడం లేదు.
కాంగ్రేస్ పాలనలో తాండాలు అభివృద్ధికి దూరం అయ్యాయి.
కాంగ్రేస్ పాలనలో సంపండా వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు, మళ్ళి కెసిఆర్ వైపు ఆశగ చూస్తున్నారు..