పెళ్లై బిడ్డ పుట్టాక వచ్చిన కళ్యాణలక్ష్మి చెక్కు..
గోదావరిఖనిలో షాదీముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్..
పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు.కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్..మాట్లాడుతూ రాష్ట్రంలో పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఒక వరంలా మారాయి అన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సిబ్బంది కార్పొరేటర్లు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..
ప్రస్తుతం ఓ చంటి బిడ్డని ఎత్తుకొని చెక్కు తీసుకోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాస్యాస్పదంగా మారింది… అంతేకాదు ఎమ్మెల్యే కూడా ఆ బిడ్డ నెత్తుకుని చెక్కు అందించడంతో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు లేట్ అవుతున్నాయి నిలువెత్తు నిదర్శనం ఇదే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..