బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను! మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక సంఘటన..

బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను!

మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక సంఘటన

కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్న కన్న తండ్రి

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో పత్తి మిల్లులో పని చేస్తూ భార్య, ఇద్దరు కుమారులను పోషిస్తూ జీవనం సాగించిన బాలరాజ్ అనే వ్యక్తి

ఇటీవల పత్తి మిల్లు మూతపడి ఉపాధి కోల్పోవడంతో, భర్త, దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని వదిలేసి, చిన్న కుమారుడితో పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
https://x.com/r9telugunews/status/1991017300527665554?s=20
బాలరాజ్ స్థానికంగా హోటల్లో పని చేస్తూ పెద్ద కుమారుడిని పోషిస్తున్న క్రమంలో, తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన పెద్ద కుమారుడు హరీష్(8)

కొడుకు అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక, స్మశానంలో మృతదేహాన్ని పట్టుకుని 8 గంటలపాటు ఏడుస్తూ కూర్చున్న బాలరాజ్

బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను అంటూ కన్నీరు పెట్టుకున్న తండ్రి బాలరాజ్..