స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జీవో(46) విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జీవో(46) విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు 50% మించకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో

వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా,

సర్పంచులకు 2011 సెన్సస్ ఆధారంగా..

( బీసీ సర్పంచ్ అభ్యర్థులకు) 2024 కుల సర్వే) రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం..

తెలంగాణ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కేటాయింపుపై జీవో 46ను విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు ఈ జీవో కీలక సూచనలను చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ పరిమితి రాజ్యాంగబద్ధమైన ఎన్నికల నిర్వహణకు కీలకం కానుంది…బీసీ రిజర్వేషన్ల నిర్ధారణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. అంటే మునుపటి ఎన్నికలలో రిజర్వ్ చేసిన వార్డులు/గ్రామాలు తిరిగి అదే కేటగిరీకి రిజర్వ్ చేయబడవు. రిజర్వేషన్ల కేటాయింపుకు ప్రామాణికంగా 2011 జనగణన వివరాలతో పాటు SEEPC 2024 డేటాను కూడా వినియోగించనున్నారు. 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలోని అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయబడతాయి…