దర్శకుడు మారుతీ వివాదంలో చిక్కుకున్నాడు. రీసెంట్ గా ఆయన రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆయన కాలర్ ఎగరేయడం గురించి కామెంట్స్ చేశారు. కానీ, ఆ కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో స్టార్ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు మారుతిపై మండిపడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. కామెడీ చిత్రాల దర్శకుడు (Maruthi) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజాసాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్…
వారిలా కాలర్ ఎగరేయను’ అనే కామెంట్‌పై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుండగా… మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మారుతికి సపోర్ట్‌గా పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో డైరెక్టర్ మారుతి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు.
అది నా ఉద్దేశం కాదు
‘ఈవెంట్లో గురించి పర్సనల్‌గా క్లారిటీ ఇవ్వాలని అనిపించింది. ముందుగా ప్రతీ అభిమానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. ఎవరినీ బాధ పెట్టడం, అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. కొన్నిసార్లు ఫ్లోలో మనం నిజంగా అర్థం చేసుకునే దానికి డిఫరెంట్‌గా విషయాలు బయటకొస్తాయి. నా కామెంట్స్ తప్పుగా వెళ్లినందుకు నేను చింతిస్తున్నా. ఎన్టీఆర్ పట్ల వారి అభిమానుల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది.
సినిమా పట్ల మీ హీరో పట్ల మీరు చూపే ప్రేమకు నిజంగా విలువ ఇస్తున్నా. మీరు పరిస్థితి దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.’ అంటూ రాసుకొచ్చారు. మారుతి కామెంట్స్‌తో ఫ్యాన్ వార్ స్టార్ట్ కాగా… ఈ పోస్ట్‌తో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందనే చెప్పాలి.