నియోజకవర్గాల పునర్విభజన పై కసరత్తు షురూ
జాతీయస్థాయిలో నియోజకవర్గాల పునర్విభజన రోడ్ మ్యాప్ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన కు పలు కీలక ప్రతిపాదనలను పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
తదుపరి పార్లమెంటు సాధారణ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే
నియోజకవర్గాల పునర్విభజనలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లతోపాటు మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు
రాష్ట్రాల్లో అసెంబ్లీల సీట్లు లోక్సభ సీట్లు ఏ రకంగా ఉండాలనే దానిపై పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్న కేంద్రం
ప్రస్తుతం ఉన్న రేషియోనే కొనసాగించే ఆలోచనలో కేంద్రం
జనాభా నియంత్రణతో తమకు నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు
దక్షిణాది రాష్ట్రాల ఆందోళనని పరిగణలోకి తీసుకున్న కేంద్రం
అసెంబ్లీ లోక్సభ సీట్ల విషయంలో ప్రస్తుతం ఉన్న రేషియోనే కొనసాగించేలా కసరత్తు
జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత దాని ఆధారంగానూ పలు ప్రతిపాదనలు పరిశీలించాలని చూస్తున్న కేంద్రం
పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు
రిజర్వేషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్న నేషనల్ డీలిమిటేషన్ కమిషన్
ఇప్పటివరకు దేశంలో నాలుగు సార్లు నియోజకవర్గాల పునర్విభజన
నియోజకవర్గాల పునర్విజనకు డీ లిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేయనున్న కేంద్రం
2027 లో జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత ప్రారంభం కానున్న నియోజకవర్గాల పునర్వి జన ప్రక్రియ