స్థానిక ఎన్నికల వేల..బిఆర్ఎస్ లోకి చేరికలు…!

సూర్యాపేట జిల్లా..

*స్థానిక ఎన్నికల వేల.. బిఆర్ఎస్ లో చేరికల జోరు..*

*మాజీ MPTC సహా పలువురు కాంగ్రేస్ నేతలు BRS లో చేరిక..*

*గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రచారం జోరుగా కొనసాగుతున్న సమయంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ తో సహా పలువురు నాయకులు, కార్యకర్తలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గులాబీ గూటికి చేరారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని మటంపల్లి మండలం హనుమంతుల గూడెం, కామంచికుంట తండా గ్రామాలకు చెందిన మాజీ ఎంపిటిసి బొమ్మకంటి నరసింహారావు, బాదావత్ రాంబాబు తో పాటు ఆయా గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి లతో పాటు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.