తొలివన్డేలో టీమిండియా ఘన విజయం..కోహ్లీ శతక గర్జన…!

దక్షిణాఫ్రికాతో ఆరంభమైన మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ బోణీ కొట్టింది. రాంచీ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన తొలివన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై భారత్‌ గెలుపుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్‌ కోహ్లీ సెంచరీతో కదంతొక్కగా, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు అర్ధసెంచరీలతో మెరిశారు. కోహ్లీ 135, రాహుల్‌ 60, రోహిత్‌ 57, రవీంద్ర జడేజా 37 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌, కోర్బిన్‌ బాష్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో అద్భుతంగా పోరాడిన సౌతాఫ్రికా జట్టు ఓటమి పాలైంది…

స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమికి దీటుగా బదులిచ్చింది భారత జట్టు. రాంచీలో అదివారం ఆధిపత్యం చేతులు మారిన తొలి వన్డేలో సూపర్ విక్టరీ సాధించింది. కేహెల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత బంతితో కుల్దీప్ యాదవ్ (4-68) తిప్పేయగా.. ప్రత్యర్థినికి ఆలౌట్ చేసి సిరీస్‌లో ముందంజ వేసింది. భారత్ నిర్ధేశించిన భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తన తొలి ఓవర్లోనే హర్షిత్ రానా (3-35) తొలి బంతికే ఓపెనర్ రియాన్ రికెల్టన్(0)ను బౌల్డ్ చేసిన రానా.. నాలుగో బంతికి క్వింటన్ డికాక్‌(0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. అంతే.. 7 పరుగులకే సఫారీ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఒత్తిడికి లోనైన కెప్టెన్ ఎడెన్ మర్క్‌రమ్(7) సైతం అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో రాహుల్ చేతికి దొరికిపోయాడు. ఆ తర్వాత మాథ్యూ బ్రీట్జ్(54 నాటౌట్)తో టోనీ డి జోర్జి(39) కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. క్రీజులో కుదురుకున్నాక బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికించిన ఈ ద్వయాన్ని కుల్దీప్ విడదీశాడు..

బ్రావిస్‌ను హర్షిత్ అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన యన్‌సెన్ అద్భుతంగా ఆడి దక్షిణాఫ్రికాను విజయానికి చేరువ చేశాడు. 39 బంతుల్లోనే 3 సిక్స్‌లు, 8 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. మాథ్యూతో కలిసి 97 పరుగులు జోడించాడు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటవడం సఫారీ జట్టును దెబ్బ తీసింది. చివర్లో బాష్ (67) వీరోచిత పోరాటం చేసి భారత్‌ను భయపెట్టాడు. చివరకు దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. కేవలం 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3, అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశాడు..

కోహ్లీ శతక గర్జన..

టాస్ ఓడిన భారత జట్టు తొలుత భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేస్తూ విరాట్ కోహ్లీ(135) శతకంతో గర్జించగా.. రోహిత్ శర్మ(57) విధ్వసంక ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 135 రన్స్ జోడించి మంచి పునాది వేశారు. హిట్‌మ్యాన్ ఔటయ్యాక గేర్ మార్చిన కోహ్లీ సిక్సర్లతో రెచ్చిపోయి 52వ సెంచరీ సాధించాడు. అతడు ఔటయ్యాక కెప్టెన్ కేఎల్ రాహుల్(60) డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడి స్కోర్ 300 దాటించాడు. రవీంద్ర జడేజా(32) కూడా రాణించగా నిర్ణీత ఓవర్లలో టీమిండియా ప్రత్యర్థికి 350 పరుగుల పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది.