కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరు..పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పది తరవాత స్పందించిన కాంగ్రెస్ పార్టీ..మంత్రుల తీరుపై..మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
*సూర్యాపేట జిల్లా..*
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించడంతోపాటు. ఆ వ్యాఖ్యలపై పది రోజుల తర్వాత స్పందించిన కాంగ్రెస్ పార్టీ మంత్రుల తీరుపై మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..
కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరు..
కొందరు వాటర్ లో నీళ్లు కలుపుకొని స్పృహ కోల్పోతున్నారు..
మరికొందరు కమిషన్లు పంచుకునే పనిలో బిజీగా ఉంటున్నారు..
పవన్ వ్యాఖ్యలపై పది రోజులకు స్పందించడం హాస్యాస్పదం..
ఒక ప్రాంతం మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఉద్యమ సమయంలో మేమెప్పుడూ ప్రాంతాలను దూషించలేదు..
అన్నదమ్ములుగా విడిపోయి వేరువేరుగా కలిసి బతుకుదామని కేసీఆర్ అనాడే చెప్పారు.
కెసిఆర్ నీడలో హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉన్నామని అక్కడి ప్రజలే చెప్పారు..
ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిది..
అంతే కానీ సినిమాలు ఆపుతామని ఇక్కడి మంత్రి కామెడీగా మాట్లాడుతున్నారు.
వాస్తవానికి అభిమానం.. వేరు రాజకీయం వేరు..
తమ అభిమాన హీరోగా ఎవరి సినిమాలైనా ఆదరిస్తారు..
పది రోజుల తర్వాత స్పందించిన తీరు ఇద్దరిలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టుంది..
కండ్ల ముందు కృష్ణ నీళ్లు తీసుకెళ్తుంటే అప్పుడూ అలసత్వమే..
వాటర్ నీళ్లు, కమిషన్ల పై పెట్టిన దృష్టి అభివృద్ధి పై పెడితే మంచిది..