శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రులపై , స్తానిక ఎమ్మెల్యే పై సంచలన కామెంట్స్..
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచెడు గ్రామం
శ్రీకాంత్ చారి పదహరోవ వర్ధంతి రోజు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రులపై , స్తానిక ఎమ్మెల్యే పై సంచలన వ్యాఖ్యలు చేశారు ..
టీఆర్ఎస్ పార్టీ హయాంలో శ్రీకాంత్ చారి వర్ధంతి కానీ జయంతి కానీ బాగా చేసారు.. కొన్ని పరిస్థితుల వల నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను .. గత మూడు సంవత్సరాల నుండి కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదు ..
సొంత నియోజకవర్గంలో విగ్రహాలు పెట్టొద్దు, జయంతి లు , వర్ధంతులు చేసుకోవద్దు అని కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నరు..
శ్రీకాంత్ చారి ఆత్మబలిదానం వల్ల వచ్చిన తెలంగాణ లో జిల్లా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యే బుగ్గ కారులలో తిరుగుతూ మూడు సంవత్సరాల నుండి విగ్రహాలు పెట్టకుండా , వర్ధంతి, జయంతి చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు..
ఈ విషయాన్ని అంత సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా.. జిల్లా మంత్రులు , నియోజకవర్గ ఎమ్మెల్యే నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు.. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు..
మంత్రి ఉత్తమ్ కుమార్ చేయబట్టి
నేను మోసపోయా .. ఉత్తమ్ కుమార్ రెడి నా కొడుకు వర్ధంతి నీ నాలుగవ తారీకు పెట్టుకొన్నాడు .. వర్ధంతి కార్యక్రమాన్ని చెడగొట్టినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి , మందుల సామెల్ కు నా నమస్కారాలు…