షాకింగ్ విజువల్స్
గోవా బిర్చ్ నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం దృశ్యాలు
అగ్నిప్రమాదంలో 23 మంది మృతి
https://x.com/r9telugunews/status/1997643773073908192?s=20
బిర్చ్ నైట్ క్లబ్ యజమానులు గౌరవ్ లూత్రా, సౌరభ్ లూత్రాలపై కేసు నమోదు.. సర్పంచ్ రోషన్ రెడ్కర్ అరెస్టు
ఎండిపోయిన తాటి ఆకులతో నైట్ క్లబ్ నిర్మాణం.. దీంతో వేగంగా వ్యాప్తి చెందిన మంటలు..
వైరల్గా భయానక దృశ్యాల వీడియో..
బిర్చ్ నైట్ క్లబ్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. నైట్ క్లబ్లో ఓ లేడీ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తూ ఉంది. ఆమె వెనకాల కొంతమంది డ్రమ్స్ వాయిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. జనం ఆ ఆట, పాటకు మైమరచిపోయి కేకలు వేస్తూ ఉన్నారు. ఇంతలో వారి వెనకాల పైకప్పు నుంచి మంటలు మొదలయ్యాయి. సెకన్లలో ఆ ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో భయపడిపోయిన డ్యాన్సర్, ఇతర వ్యక్తులు అక్కడినుంచి పరుగులు పెట్టారు. నిప్పు కణికలు పైకప్పు నుంచి కిందకు రాలుతూ ఉన్నాయి..
బాధిత కుటుంబాలకు 2 లక్షలు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రధాని ఓ ప్రకటన విడుదల చేశారు..