సూర్యాపేట జిల్లా..
*గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రచారం జోరుగా కొనసాగుతున్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గులాబీ గూటికి చేరారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని చివ్వెంల మండలం వల్లభాపురం, జగన్నాయక్ తండ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మంగళవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…