రాహుల్ సిప్లిగంజ్‌కి రూ. కోటి కళ్యాణ లక్ష్మి..!

..

రాహుల్ సిప్లిగంజ్‌కి రూ. కోటి కళ్యాణ లక్ష్మి

మీరిచ్చిన పైసలతో పెళ్లి ఘనంగా చేసుకున్నానంటూ రేవంత్ రెడ్డికి రాహుల్ కృతజ్ఞతలు…

దేశవ్యాప్తంగా (Independence Day) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ పోలీసులకు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj)కు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్ అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరైన రాహుల్ సిప్లిగంజ్.. సీఎం చేతుల మీదుగా రూ. కోటి చెక్ నగదు ప్రోత్సాహకం అందుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌కు సీఎం విషెస్ తెలిపారు. కాగా, ఇటీవల పాతబస్తీ బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాహుల్‌కు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంలో తను పాడిన ‘నాటు నాటు’ సాంగ్‌‌కు ఆస్కార్ అవార్డు రావడంతో దేశవ్యాప్తంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాపులర్ అయ్యారు. ఆ ఒక్క పాటతో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నారు…

సోషల్ మీడియాలో విమర్శలు.. ఇలా..

కళ్యాణ లక్ష్మి ఇచ్చినట్లు రాహుల్ సిప్లిగంజ్‌కి రూ. కోటి ప్రజాధనం ఇవ్వాల్సిన అవసరమేంటి ?

ఆడపిల్లలకు తులం బంగారం ఇవ్వలేని రేవంత్ రెడ్డి రాహుల్‌కి రూ. కోటి ఎలా ఇచ్చారు ?

హామీలు నెరవేర్చడానికి పైసాలు లేవంటూనే, ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేస్తున్న రేవంత్ రెడ్డి

ప్రభుత్వం తరపున రాహుల్ సిప్లిగంజ్‌కి భారీ నగదు ఇవ్వడంపై మండిపడుతున్న ప్రజలు
.

రూ. కోటి ప్రోత్సాహకం ఇస్తే, రాహుల్ పెళ్లికి ఖర్చు చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు..

ఆయన వల్ల తెలంగాణకు జరిగిన లాభమేంటి.. స్వతంత్ర సమరయోధుడా అంటూ వ్యవస్థాయల విమర్శలు గుప్పిస్తున్నారు..