అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ.. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన కోడలు…!

అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ.. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన కోడలు

నిర్మల్ జిల్లాలో అమెరికా నుంచి వచ్చిన మామ వేసిన ఒక్క ఓటుతో కోడలు సర్పంచ్ అయ్యారు. హోరాహోరీగా కౌటింగ్ జరగ్గా.. శ్రీవేద అనే అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ కుటుంబం నుంచి మూడో తరం విజయం సాధించడం విశేషం. ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు నిర్ణయమైన సంఘటనలు ఆసక్తికరంగా మారాయి…

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ముత్యాల శ్రీవేద..

ముత్యాల శ్రీవేద ఎన్నికల్లో నిల్చుందని అమెరికా నుండి 4 రోజుల ముందు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి..

ఎన్నికల్లో 426 ఓట్లకు గాను 378 పోలవ్వగా.. శ్రీవేదకు వచ్చిన ఓట్లు 189, హర్షస్వాతికి వచ్చిన ఓట్లు 188, చెల్లని ఒక్క ఓటు..

ఓటర్లు మరోసారి తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. తొలి విడత పోలింగ్ కంటే కూడా అధికంగా 85 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. ముఖ్యంగా తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న యువ ఓటర్లలో పోలింగ్ పట్ల ఎక్కువ ఆసక్తి, జోష్ కనిపించింది. ఓటు విలువ ఎంతటిదో చాటిచెప్పే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పలు పంచాయతీల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో విజేతలుగా నిలిచారు. కొన్నిచోట్ల అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో.. విజేతను లక్కీడ్రా ద్వారా నిర్ణయించారు…