ముస్లిం మహిళ హిజాబ్ ను బలవంతంగా తొలగించిన..
బీహార్ సిఎం నితీష్ కుమార్ పై కేసు నమోదు చేయాలి …
ముస్లిం మహిళ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి …
పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన ముస్లిం సోదరులు ఎస్ఐ కి ఫిర్యాదు…
హుజూర్ నగర్ ముస్లిం సోదరులు ఈరోజు శుక్రవారం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసి
ఈ సందర్భంగా పలువురు ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండి.అజీజ్ పాషా,.
ఎంఏ అబ్దుల్ మజీద్,ఎస్.కె మన్సూర్ అలీలు మాట్లాడుతూ …
రాజ్యాంగబద్ధమైన బీహార్ రాష్ట్ర ముఖ్యం మంత్రి పదవిలో ఉన్న నితీష్ కుమార్ ఈనెల 15 తేదీన బీహార్ రాష్ట్రం పాట్నాలో ఆయుష్ డాక్టర్ నియామక పత్రాలు అందజేయు
ప్రభుత్వ కార్యక్రమంలో *ఒక యువ ముస్లిం మహిళ డాక్టర్ యొక్క నకాబ్,హిజాబ్ ను ముఖ్యమంత్రి* *లాగే ప్రయత్నిస్తూ హిజాబ్ ను కిందికి లాగినాడు ఒక ముస్లిం మహిళను కించపరిచి హేళన చేసినాడు…
ముఖ్యమంత్రి నితీష్ కుమార్
పదవిలో ఉండి విచక్షణ మరచి
చట్టాన్ని,రాజ్యాంగ నియమ నిబంధనల సూత్రాలను *భారత రాజ్యాంగంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 ని మైమరచి కావాలని* దురుద్దేశంతో ఇట్టి చర్యల కు పాల్పడి..ముస్లిం మహిళా సమాజాన్ని కించపరిచిన సీఎం నితీష్ కుమార్ ఆయన మానసిక ఆరోగ్యం పై పలు అనుమానాలు ఉన్నాయని వారు అన్నారుఅన్నారు.
కూడా ఒక ” *మనిషే కదా* ” అతని
తోబుట్టువులు ఉంటారుగా ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు….
భారత రాజ్యాంగంలో మతా,వాక్కు వస్త్రాదరణ స్వేచ్ఛను కలిగి ఉన్నప్పటికీ
నితీష్ లాంటి నాయకుల వలన
రాజ్యాంగం ఉన్నత స్థితిని అస్తిత్వాన్ని కోల్పోతుందని మత విద్వేషాలను రెచ్చగొడు.. ముస్లిం మహిళ లోకాన్ని చులకన చేస్తూ స్టేజ్ మీద ఉన్న మిగతా నాయకులు నవ్వుతూ హేళన తో అనుచిత గా ప్రవర్తించిన *నితీష్ కుమార్ పై వెంటనే చట్టపరిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని,..
అలాగే ముస్లిం మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, ముస్లిం సోదరులు డిమాండ్ చేస్తూ
*స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చారు ….
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పెద్దలు,నాయకులు అబ్దుల్ ఖాదర్ సాబ్,రహీం భాయ్,జాకీర్ భాయ్ సిరాజ్,నాగుల్ మీరా,ఖయ్యూం ఇబ్రహీం,సోహెల్,ఖాదర్ భాయ్,
రషీద్ భాయ్,రియాజ్,జానీ భాయ్,
చోట షఫీ,జానీ మియా,ఇమ్రాన్
అలీ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు….