హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం..
హైదరాబాద్: హయత్‌నగర్‌లో గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు గన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
గన్‌మెన్ కృష్ణ చైతన్య ఇంట్లోనే తన వద్ద ఉన్న తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే చైతన్యను ఆస్పత్రిలో చేర్చారు.
ప్రస్తుతం చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు చైతన్య ఇటీవలే ఓ బెట్టింగ్ యాప్‌లో భారీగా డబ్బు పోగొట్టుకున్నట్టు సమాచారం. దాంతో ఏర్పడ్డ ఆర్థిక సమస్యలే ఈ అఘాయిత్యానికి కారణంగా భావిస్తున్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కృష్ణ చైతన్య ఆదివారం ఉదయం తన గన్‌తో పేల్చుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని కామినేని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్‌కి బానిసైన కృష్ణ చైతన్య, భారీగా నష్టపోయాడు. వచ్చే జీతాన్ని పూర్తిగా బెట్టింగ్ యాప్స్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది.ఈ ఘటన గురించి హైడ్రా సీపీ రంగనాథ్ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి డాక్టర్లతో ఆయన మాట్లాడారు. కృష్ణ చైతన్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. గన్ ఫైర్ చేసిన సమయంలో బుల్లెట్ తల కొంచెం పక్క నుండి వెళ్లి నట్లు వైద్యులు వెల్లడించారు. కృష్ణ చైతన్యకు వివాహం జరిగి ఐదేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు పుట్టలేదని తెలుస్తోంది. ఈ ఘటన వెనుక ఇదీ కూడా ఓ కారణంగా తెలుస్తోంది.