నా గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా, కృతజ్ఞతలు… మేళ్లచెరువు సర్పంచ్ బచ్చు పద్మావతి శ్రీనివాస్ రెడ్డి..
సూర్యాపేట జిల్లా..
మేళ్లచెరువు మేజర్ గ్రామపంచాయతీలో గెలిచిన బిఆర్ఎస్ సర్పంచ్ బచ్చు పద్మావతి, శ్రీనివాస్ రెడ్డి,
నేడు పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం..
పాల్గొన్న బిఆర్ఎస్ శ్రేణులు గ్రామ ప్రజలు..
ఈ సందర్భంగా సర్పంచ్ బచ్చు పద్మావతి, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అత్యంత పెద్దదైన గ్రామపంచాయతీ, సుమారుగా 11 వేల ఓట్లు ఉన్న గ్రామపంచాయతీలో నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు..
హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే అతిపెద్దదైన మేళ్లచెరువు గ్రామపంచాయతీ BRS పార్టీ బలపరిచిన సర్పంచ్ గా గెలిపించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు..
తన గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా, కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు..
గ్రామపంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు..
సొంతంగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టో లో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా, గ్రామపంచాయతీ ప్రజలు మరియు యువకులతో కలిసి పని చేస్తానని అన్నారు…
సమస్య ఏదైనా దాన్ని పరిష్కరించే విధంగా గ్రామపంచాయతీ పరిధిలో తన వంతు సహాయ సహకారాల అందిస్తామని తెలిపారు…