భారత్‌ సిద్ధంగా ఉండాలి : సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌..!

అణు దేశాలైన చైనా (China), పాకిస్థాన్‌ (Pakistan) ల నుంచి ముప్పు పొంచి ఉన్నదని సీడీఎస్‌ (Chief of Defence Staff – CDS) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ (General Anil Chauhan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సవాళ్లుగా ఉన్నాయని గుర్తుచేశారు. స్వల్పకాలిక, సుదీర్ఘ యుద్ధాలకు భారత్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఐఐటీ బాంబే (IIT Bombay) లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు..

భారత్ స్వల్ప, దీర్ఘకాలిక తీవ్ర సంఘర్షణలు, దీర్ఘకాలిక భూ-కేంద్రీకృత యుద్ధాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. పరోక్షంగా పాక్, చైనా దేశాల నుంచి భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆయన ప్రస్తావించారు.

భారత్ ఎదుర్కొనే సవాళ్లకు సంబంధించి సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ రెండు ప్రధాన అంశాలను వివరించారు. “మన ప్రత్యర్థి దేశాల్లో ఒకటి అణ్వాయుధ దేశం, మరొకటి న్యుక్లియర్ ఆర్మ్ డ్ కలిగిన దేశం. అందువల్ల భారత్ అణు నిరోధక స్థాయిని అధిగమించకూడదు” అని తెలిపారు. ఈ మేరకు చైనా, పాకిస్తాన్‌లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు..
తీవ్రవాద నివారణకు ‘ఆపరేషన్ సింధూర్’ వంటి స్వల్పకాలిక, తీవ్రత గల సంఘర్షణలకు భారత్ సిద్ధపడాలని చౌహాన్ పేర్కొన్నారు. భూ వివాదాలున్నందున దీర్ఘకాలిక, భూ-కేంద్రీకృత ఘర్షణలకు కూడా సంసిద్ధంగా ఉండాలని, వాటిని నివారించాలని చౌహాన్ అభిప్రాయపడ్డారు.

మన ఇద్దరు ప్రత్యర్థులు అణుసామర్థ్యం కలిగి ఉన్నారని, ఆ దేశాల నుంచి వచ్చే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని సీడీఎస్‌ అన్నారు. గతంలో నిర్వహించిన ఆపరేషన్ల మాదిరిగానే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి స్వల్ప, దీర్ఘకాలిక ఘర్షణలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే కొనసాగుతోన్న సరిహద్దు వివాదాల కారణంగా భూతల ఘర్షణల్లో పోరాడేందుకు రెడీగా ఉండాలన్నారు. కృత్రిమ మేథ, క్వాంటమ్ కంప్యూటింగ్, హైపర్ సోనిక్స్, రోబోటిక్స్, ఎడ్జ్‌ కంప్యూటింగ్ పోరాట తీరును మారుస్తున్నాయని చెప్పారు…