ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ సమాచార హక్కు చట్టం కింద పుతిన్ రాసిన ఒక రహస్య లేఖను బయటపెట్టింది…
24 ఏళ్ల క్రితం నాటి హెచ్చరిక: దాదాపు 24 ఏళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌కు పుతిన్ ఈ లేఖ రాశారు. ఈ లేఖలో పుతిన్ పాకిస్థాన్‌ను ప్రపంచానికే ఒక పెద్ద ముప్పుగా అభివర్ణించారు. “పాకిస్థాన్‌ను అడ్డుకోవడానికి మనం ఏదైనా చేయాలి” అని ఆయన పాశ్చాత్య దేశాలను కోరారు. పాకిస్థాన్ నిజానికి ఒక ప్రజాస్వామ్య దేశం కాదని, అది సైనిక పాలనలో (Junta) ఉందని, అలాంటి దేశం వద్ద అణు ఆయుధాలు ఉండటం ప్రపంచానికి ప్రమాదకరమని పుతిన్ హెచ్చరించారు.
అణు సాంకేతికత దొంగతనం: పాకిస్థాన్ అణు పితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ (A.Q. Khan) కేవలం రహస్య పత్రాలను దొంగిలించి పాకిస్థాన్‌కు అణు బాంబును తయారు చేయడమే కాకుండా, ఆ సాంకేతికతను ఇరాన్, ఉత్తర కొరియా మరియు లిబియా వంటి దేశాలకు కూడా విక్రయించారని పుతిన్ పేర్కొన్నారు. ఈ ‘A.Q. Khan నెట్వర్క్’ ప్రపంచ భద్రతకు గండమని ఆయన నొక్కి చెప్పారు.
బుష్-పుతిన్ మధ్య చర్చ: ఈ పత్రాల ప్రకారం, ఇరాన్ అణు కార్యక్రమంపై ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ వద్ద ఏముందో స్పష్టంగా తెలియదు కానీ, వారికి పాకిస్థాన్ సహకారం ఉందని పుతిన్ అన్నారు. దీనిపై బుష్ స్పందిస్తూ, “నేను ముషారఫ్‌తో మాట్లాడాను. ఇరాన్, ఉత్తర కొరియాకు సాంకేతికత బదిలీపై మా ఆందోళనను తెలిపాను. ముషారఫ్.. ఏక్యూ ఖాన్ మరియు అతని అనుచరులను జైలులో ఉంచి, ఆపై గృహనిర్బంధంలో ఉంచారు. అయితే ముషారఫ్ తనకు ఏమీ తెలియనట్లు నటిస్తున్నారా లేదా పూర్తి సమాచారం ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు” అని అన్నారు. దీనికి సమాధానంగా పుతిన్, “నాకు తెలిసినంతవరకు ఇరాన్ సెంట్రిఫ్యూజ్‌లలో పాకిస్థాన్ మూలాలున్న యురేనియం దొరికింది” అని బాంబు పేల్చారు.. అయితే దీనిపై పలు దేశాలు అంత ఆందోళన వ్యక్తం అవుతున్నది… పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశాలకు మాత్రం వణుకు పుట్టిస్తుంది..
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959