న్యూ ఇయర్ రోజు ఇంట్లో ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా అనేది మీరే తేల్చుకోండి..హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్…!

న్యూ ఇయర్ రోజు ఇంట్లో ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా అనేది మీరే తేల్చుకోండి..!

డ్రంక్ అండ్ డ్రైలో పట్టుబడితే జైల్లో వేయటం ఖాయం అని వార్నింగ్..!?

హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఇప్పటికే న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రై నడుస్తోంది..

జనవరి 1వ తేదీ వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రై నిర్వహిస్తాం..

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్…

డ్రగ్స్ వాడకాన్ని ఉపేక్షించేదే లేదని అన్నారు. శుక్రవారం నుంచే హైదరాబాద్‌లో పబ్‌లు, హోటళ్లు, రెస్టరెంట్లు, ఈవెంట్లు జరిగే జరిగే ప్రదేశాల్లో స్పెషల్‌ నిఘా టీమ్‌లను మోహరించామని తెలిపారు. అంతేకాదు సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపై కూడా నిఘా ఉంటుందని చెప్పారు. గత రెండేళ్లలో డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నవారి కదలికలు గమనిస్తున్నామని.. డ్రగ్స్ సరఫరా చేసేవారు, వాటికి అలవాటు పడ్డ వారి లిస్ట్‌ను సిద్ధం చేయాలని చెప్పారు. వాళ్లపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరానికి కొత్తగా వచ్చే వారి వివరాలు కూడా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు…న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హోటళ్లు, రెస్టరెంట్లు, పబ్‌లు రాత్రి ఒంటి గంటకు మూసీ వేయాలని ఆదేశించారు. ఎవరైనా రూల్స్‌ ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే వాళ్ల లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మైత్రీవనం, నెక్లెస్ రోడ్డు, కేబీఆర్ పార్క్, ట్యాంక్‌బండ్‌తో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిఘా ఉండాలని.. వేడుకలు ప్రశాంతగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.