మంచినీళ్లు అనుకొని కెమికల్ – తాగిన క్షణాల్లోనే యువకుడి మృతి..

crime/student-died-after-drinking.

తమ కుమారుడు అనారోగ్యం పాలవ్వడంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు అతడిని ఎప్పటిలాగే ఆరోగ్యంగా చూడాలనుకున్నారు.

ఆ యువకుడి తల్లికి కుమారుడంటే చెప్పలేని ప్రేమ. చేతికొచ్చిన కుమారుడు అనారోగ్యం బారిన పడటం చూసి వారు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా నయం చేయించాలనుకున్నారు. కానీ అంతలోనే తమ కుమారుడు అనంతలోకానికి పయనమయ్యాడు. ఆసుపత్రికి వెళ్లిన ఆ యువకుడికి అసలు ఏమైంది?

ఆసుపత్రిలో జ్వరంతో బాధపడుతున్న కుమారుడికి మాత్ర ఇచ్చిన తల్లి, తాగు నీరనుకొని అక్కడి ల్యాబులోని ప్రమాదకర కెమికల్ను తాగించడంతో అతను క్షణాల్లో వెంటనే మృతి చెందిన విషాదకర ఘటన శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, అనుముల మండలంలోని చిన్న అనుముల గ్రామానికి చెందిన సండ్ర సత్యనారాయణ-రామలింగమ్మ అనే దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం..జ్వరం ఎక్కువగా ఉండటంతో పారాసిటమాల్ : కుమారుడు గణేశ్‌ (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రెండు రోజులుగా అతనికి జ్వరం వస్తుండటంతో అనుముల గ్రామంలోని ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం శనివారం ఉదయం మిర్యాలగూడలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జ్వరం ఎక్కువగా ఉండటంతో ముందు పారాసిటమాల్‌ మాత్ర వేయాలని వైద్య సిబ్బంది సూచించారు.

తాగునీరే అనుకుని : దీంతో కుమారుడికి పారాసిటమాల్ మాత్ర ఇచ్చిన తల్లి, తాగు నీటి కోసం ఆసుపత్రిలో ఉన్న నీళ్ల క్యాను వద్దకు వెళ్లగా అందులో నీళ్లు లేవు. దీంతో తాగునీటి కోసం అటు ఇటు చూస్తూ ఆ పక్కనే ఉన్న ల్యాబులోకి వెళ్లింది. అక్కడ క్యానులో ఉన్న ఫార్మాల్డిహైడ్‌ రసాయనాన్ని తాగు నీరే అనుకొని బాటిల్‌లో నింపి తీసుకొని వచ్చి కుమారుడికి ఇచ్చింది. రెండు గుటకలు తాగిన గణేశ్‌ వెంటనే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు.