భర్త మరణాన్ని తట్టుకోలేక న్యూ ఇయర్ రోజు పిల్లలతో సహా భార్య ఆత్మహత్య..
పిల్లలకు విషం అన్నం తినిపించి.. తాను ఆత్మహత్య చేసుకున్న భార్య..
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాద ఘటన..
కల్వకుర్తిలోని తిలక్‌నగర్‌లో నివసిస్తున్న ప్రసన్న (40) భర్త భీమ్శెట్టి ప్రకాశ్ 40 రోజుల కిందట మృతి..
భర్త మృతి తర్వాత తీవ్ర విషాదంలోకి భార్య ప్రసన్న.. భర్త లేని జీవితం తనకు వద్దంటూ పిల్లలతో సహా మరణించాలని ప్రసన్న నిర్ణయం..
31వ తేదీ రాత్రి కుమారుడు, కుమార్తెతో కలిసి ఆమె కేక్ కట్ చేసి కొత్త సంవత్సరం చేసుకున్న, అనంతరం కుమారుడు అశ్రిత్, కుమార్తె మేఘన (13)కు పురుగుల మందు కలిపిన అన్నం తినిపించిన అనంతరం తాను కూడా తిని ఆత్మహత్య..
పరిస్థితి విషమించి తల్లి కుమార్తె మరణించగా.. కొన ప్రాణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు..
చనిపోవాలని నిర్ణయానికి రాగా.. ఇద్దరు పిల్లలు గుర్తుకు వచ్చారు. తనతోపాటు వారిని కూడా తీసుకెళ్లాలని భార్య ప్రసన్న నిర్ణయం తీసుకుంది. చనిపోవాలని నిర్ణయానికి వచ్చిన ఆమె 31వ తేదీ న్యూఇయర్ వేడుకలు పిల్లలతో కలిసి చేసుకుంది. రాత్రి కుమారుడు, కుమార్తెతో కలిసి ఆమె కేక్ కట్ చేసి కొత్త సంవత్సరం చేసుకున్నారు. ఆ తర్వాత పురుగుల నివారణ మందును అన్నంలో కలిపింది. మందు కలిపిన అన్నం తన ఇద్దరు పిల్లలకు తినిపించిన ప్రసన్న అనంతరం ఆమె కూడా తినేసింది. కొద్దిసేపటి తర్వాత వీరి పరిస్థితి విషమించి అపస్మారక స్థితికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే తల్లి ప్రసన్న, కుమార్తె మేఘన మరణించారు. కుమారుడు అశ్రిత్ కొన ప్రాణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు..
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959