యూట్యూబర్ అన్వేష్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.

యూట్యూబర్ అన్వేష్ పై పాలకీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త నక్క, శ్రీనివాస్.

హిందూ దేవి దేవతలను, మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఫిర్యాదు..

అన్వేష్‌పై సామాజిక కార్యకర్తలు నక్క, శ్రీనివాస్ పాలకీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ వేదికగా అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు..

సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని నక్క, శ్రీనివాస్ ఆరోపించారు. ఇలాంటి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, విషయాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959