ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా అకుంఠిత దీక్షతో ముందుకు సాగిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే.. జాగృతి కవిత..
హైదరాబాద్.
సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా కల్వకుంట్ల కవిత వీడియో సందేశం.
సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ ఆమె ఈ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే గారు కేవలం 17 ఏళ్ల వయసులోనే బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తన భర్త జ్యోతిరావ్ పూలే గారి సహకారంతో తాను చదువుకోవడమే కాకుండా, బాలికల విద్య కోసం జీవితాంతం పోరాటం చేశారని తెలిపారు..
సమాజంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా అకుంఠిత దీక్షతో ముందుకు సాగిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కవిత కొనియాడారు. నేడు దేశంలో కోట్లాది మంది ఆడబిడ్డలు చదువుకుంటున్నారంటే, అది ఆమె చేసిన పోరాటం, త్యాగం ఫలితమేనని పేర్కొన్నారు..
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా దేశంలో ఆడబిడ్డల అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మహిళల అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు..
ఆ ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యత పెంచేందుకు తాము ప్రత్యేకంగా కృషి చేస్తామని, ఈ దిశగా సంకల్పం తీసుకుంటున్నామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959