బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణహత్యకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం దుండగుల దాడిలో గాయపడ్డ బెంగాలీ హిందూ వ్యాపారవేత్త ఖోకోన్ దాస్ (50) చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారని స్థానిక మీడియా నివేదించింది. ఇప్పటివరకు వరుసగా ముగ్గురు హిందువుల హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢాకాలో విద్యార్ధి సంఘం నేత ఉస్మాన్ హాదీ హత్య తరువాత వరుసగా హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి…డిసెంబర్ 31న బంగ్లాదేశ్‌లోని షరియత్‌పూర్ జిల్లాలో దుకాణం యజమాని అయిన దాస్ ఇంటికి తిరిగి వస్తుండగా కత్తితో పొడిచి, కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. చంద్రదాస్ క్యూర్‌బంగా బజార్‌లో ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేస్తున్నారు. దుకాణాన్ని మూసి ఆటోలో ఇంటికి బయలుదేరగా.. మార్గమధ్యలో కొందరు దుండగులు ఆటోను ఆపారు. పదునైన ఆయుధాలతో చంద్రదాస్‌పై దాడి చేశారు. తరువాత తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూకేశారు. తర్వాత స్థానికులు ఆయనను కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.. ఇంతలో పరిస్థితి విషమించడంతో అతను మరణించాడని కుటుంబసభ్యలు తెలిపారు. తమకు శత్రువులు ఎవరూ లేరని, ఆయనపై ఎందుకు దాడి చేశారో తెలియదని ఖోకన్ భార్య సీమా దాస్ పేర్కొన్నారు. తమకు న్యాయం కావాలని కోరారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.