*సూర్యాపేట జిల్లా…*
హుజూర్ నగర్ లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పర్యటన జరిగింది.. మొదటగా హుజూర్నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం హుజూర్నగర్ లోని సబ్ జైలు వద్దకు వెళ్లి లాక్ అప్ డెత్ కి గురైన కర్ల రాజేష్ ఆరోగ్య పరిస్థితిపై విచారణ చేశారు.. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కర్ల రాజేష్ ఏ పరిస్థితుల్లో వచ్చారు అతనికి ఎలా వైద్యాన్ని అందించారో పూర్తి విచారణ చేయడం జరిగింది..
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ…
కర్ల రాజేష్ లాక్ అప్ డేట్ పట్ల కోదాడ స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి,. ఎస్సైని కాపాడడం చాలా దారుణమైన విషయమని అన్నారు…
రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉంది..
కర్ల రాజేష్ లాక్ అప్ డెత్ పట్ల స్థానికంగా ఉన్న చిలుకూరు ఎస్ఐ, సీఐతో పాటు మరికొందరి హస్తం కూడా ఉంది…
ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిట్ దర్యాప్తుతో దర్యాప్తు చేయించి నిందితులపై కఠిన చర్య తీసుకోవాలి..
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మౌనం విడాలి…. గతంలో మరియమ్మ లాకప్ డెత్ పై రాద్ధాంతం చేసి ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు…
చిలుకూరు ఎస్సైని సస్పెండ్ చేయకుండా ఎస్పీ ఆఫీసుకి అటాచ్ చేయడం పట్ల కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి హస్తము ఉన్నట్లుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా తెలిపారు…
కోదాడలో రానున్న రోజుల్లో ఉత్తమ పద్మావతికి మాదిగ బిడ్డల, ప్రతాపమెంటో చూపిస్తారని అన్నారు..
చనిపోయింది కర్ల రాజేష్ కాంగ్రెస్ కార్యకర్త అలాంటప్పుడు అటువంటి కార్యకర్తకి మీరు న్యాయం చేయలేకపోతున్నారు..
అడగటానికి వెళ్లిన వారి పట్ల కొంత ఇబ్బందికరంగా మాట్లాడినట్లుగా మందకృష్ణ మాదిగ ఆరోపించారు…
రిమాండ్ రిపోర్టులో అడుగడుగునా తప్పులతడక…
కొంతమంది డాక్టర్లు కూడా పోలీసులకి సహకరించినట్లుగా ఆరోపించారు…
అధికార పార్టీ కను సైగాల్లో పోలీసులు వ్యవహరిస్తున్నట్లుగా క్లియర్గా అర్థం అయిపోతుందని అన్నారు..
ఒక్క ఎస్సై రెండు రిమాండ్ రిపోర్ట్లు రెండు చోట్ల ఉద్యోగం ఎలా చేస్తారు ఎక్కడా లేనివిధంగా ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు…
ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు లేరు.. సదుపాయాలు లేవు అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు…
జైల్లో సరైన సదుపాయాలు లేవు .. ప్రాణాల మీదకి వస్తే కనీసం మందులు ఇచ్చే దిక్కు లేదు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు….
ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు, కర్ల రాజేష్ లాక్ అప్ డెత్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆరోపించారు..
తాను రెడ్డి సామాజిక వర్గం మొత్తానికి వ్యతిరేకం కాదని అందులో ఉండే పేద వర్గానికి తన మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు..
హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు,, కూడా ఇందులో ఇన్వాల్ అయినట్లు అనిపిస్తుంది .కొన్నిరకాల వ్యవహరించారని అన్నారు.. కోదాడలోని తమ సామాజిక వర్గానికే చెందిన ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఇందులో ఉన్నారని వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. జిల్లా కి సంబంధించిన ఏ పోలీస్ అధికారిని కూడా సిట్ దర్యాప్తులో నంబర్ గా ఉంచొద్దని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959