హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దట్టమైన పొగ మంచు..!

యాంకర్…

చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటలైనా చిమ్మచీకటిని తలపించేలా పొగ మంచు విపరీతంగా కురుస్తోంది.
పొగ మంచు ప్రభావంతో వాహనదారులు అత్యంత ఆచితూచి ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుగా వెళ్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో
దట్టమైన పొగ మంచు కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. జాతీయ రహదారిపై హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు ఆన్ చేసుకొని వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పంతంగి టోల్ ప్లాజా వద్ద పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొంతమంది వాహనదారులు తమ వాహనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
పొగ మంచు కారణంగా వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్న పోలీసులు రవాణా శాఖ అధికారులు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959