నేటి నుండి సింగిల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణ.
హుజూర్ నగర్ : హుజూర్ నగర్ లోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో అర్హులైన వారి నుండి దరఖాస్తులను హుజూర్ నగర్ తహశీల్దాల్ కార్యాలయం లో స్వీకరిస్తున్నట్లు RDO శ్రీనివాస్ తెలిపారు. గురువారం RDO కార్యాలయంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుండి ఈ నెల 20 వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఉదయం 10 .30 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో OSD ప్రేమ్ కరణ్ రెడ్డి, కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ కవిత, MPDO సుమంత్, హౌసింగ్ DE జగన్ తదితరులు పాల్గొన్నారు..
అప్లికేషన్ ఫాం.. క్రింద లింక్ లో ఉన్నది..
SRS Gutta application
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959