న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 301 పరుగుల టార్గెట్‌ను భారత్ 49 ఓవర్లలో ఛేదించింది. విరాట్ కోహ్లీ (94 పరుగులు) సూపర్ ఫామ్ చాటుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56), శ్రేయస్ అయ్యర్ (49 పరుగులు) రాణించారు. కివీస్ బౌలర్లలో కైల్ జెమీసన్ 3, ఆదిత్య అశోక్ 1 వికెట్ పడగొట్టారు. తాజా విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దుసుకెళ్లింది.
లక్ష్యం ఛేదనలో భారత్ అదుర్స్.
301 పరుగుల ఛేజింగ్‌లో భారత్‌కు మంచి ఆరంభమే లభించింది. తొలుత రోహిత్, గిల్ నెమ్మదిగా ఆడారు. అయితే రోహిత్ వేగం పెంచాడు. మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో టచ్‌లోకి వచ్చాడు. అయితే జెమీసన్ వేసిన స్లో బాల్‌కు షాట్ ప్రయత్నంలో క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. దింతో 39 రన్స్‌కు తొలి వికెట్ పోయింది. ఆ తర్వాత వచ్చిన విరాట్‌తో గిల్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇద్దరు కివీస్‌కు మరో ఛాన్స్ ఇవ్వకుండా 20 ఓవర్లపాటు ఆడారు.