పెండింగ్ చలాన్లపై తెలంగాణలో తీవ్ర వివాదం నడుస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి విధించే చలాన్‌పై డిస్కౌంట్లు అవసరం లేదని వారికి బ్యాంకు ఖాతాల నుంచి ఆటో డెబిట్ చేయాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి…..వాహనదారులతోపాటు రాజకీయ పార్టీలు కూడా తప్పుబడుతున్నాయి. ఆటో డెబిట్ అనేది అసాధ్యమని పేర్కొంటున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో రేవంత్ రెడ్డి కారుపై ఉన్న ట్రాఫిక్ చలాన్ల ఫొటోల వైరల్‌గా మారింది. ఆ కారుపై గతంలో భారీగా పెండింగ్ చలాన్లు ఉన్నాయనేది ఆ ఫొటో చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ చలాన్ పోర్టల్‌ను పరిశీలిస్తే ఒక్క చలాన్ కూడా లేదు. ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ చలాన్ ఫొటోలో భారీగా పెండింగ్ చలాన్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కారు (భద్రతా కారణాల రీత్యా చెప్పడం లేదు)పై చలాన్లు భారీగా బకాయి పడ్డాయి. ఆ కారుపై 2024 నుంచి 2025 వరకు ఉన్న చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 18 చలాన్లు బకాయి పడ్డాయి. వాటి విలువ ఏకంగా రూ.17,795 ఉన్నాయి. నాగర్‌కర్నూల్, సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో రేవంత్ రెడ్డి కారుపై చలాన్లు పడ్డాయి. రేవంత్ రెడ్డి కారుపై పడిన చలాన్లలో అత్యధికంగా ఓవర్ స్పీడ్, ప్రమాదకర డ్రైవింగ్ వంటి చలాన్లు నమోదయ్యాయి. ఒకటి సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్ వంటి చలాన్లు కూడా ఆ కారుపై ఉన్నాయి. 18 చలాన్లలో అన్నీ వెయ్యి జరిమానా పడగా.. ఒక్క చలాన్ మాత్రం రూ.200 ఉంది. అది స్టాప్ లైన్ క్రాసింగ్‌కు సంబంధించిన చలాన్ పడింది….చలాన్లు పెండింగ్ ఉండడంపై రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫొటో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఫొటో వైరల్ అవుతున్న సందర్భంగా అధికారులు ఆ చలాన్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రాఫిక్ చలాన్లపై రెండు సార్లు భారీ డిస్కౌంట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. మరి రేవంత్ రెడ్డి కారుకు కూడా బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్ డెబిట్ చేయాల? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆటోమేటిక్ డెబిట్ అనేది సాధ్యం కాదని.. అలా చేయరాదని అందరూ స్పష్టం చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్‌పై డిస్కౌంట్, రాయితీలు, ఆఫర్ ఇవ్వకపోగా ఆటో డెబిట్ చేయాలనే నిర్ణయం తప్పు అని ప్రజలు పేర్కొంటున్నారు…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959