సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధం…!

సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధం.

_• మేడారంలో తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు._

_• తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు._

_• ఈ సారి సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనా.

_• జాతర కోసం విధుల్లో మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది._

_• అదనంగా 2 వేల మంది ఆదివాసీ యువత వాలంటీర్ల సేవలు.

అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క–సారలమ్మ మహా మేడారం జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జాతర నిర్వహణ, ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావుతో పాటు అన్ని శాఖల కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనం కోసం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల భక్తులు మేడారానికి తరలివస్తారని తెలిపారు. ఈసారి సుమారు రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనాతో అన్ని శాఖలు సమన్వయంతో సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు..రవాణా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో వస్తారని, ఆ రూట్లలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక నిఘా పెంచాలని ఆదేశించారు. ముందస్తు ప్రణాళికతో మేడారం జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయని, మరో వెయ్యేళ్ల పాటు నిలిచేలా మేడారం ఆలయం నిర్మించామని మంత్రి సీతక్క తెలిపారు. విస్తరించిన రోడ్లు, ఆధునికంగా రూపుదిద్దుకున్న జంక్షన్లు, ఆదివాసీ చరిత్రను ప్రతిబింబించేలా చేసిన ఏర్పాట్లు జాతర ప్రత్యేకతగా నిలుస్తాయని పేర్కొన్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959