కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళా కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టిన గంజాయి గ్యాంగ్..!
కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళా కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టిన గంజాయి గ్యాంగ్..
సౌమ్య కడుపు మీద నుండి వెళ్లిన కారు.. తీవ్ర గాయాలపాలైన సౌమ్యను ఆసుపత్రికి తరలించి, గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు..
కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలింపు.. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్న సౌమ్య..
కానిస్టేబుల్ సౌమ్య ఆర్ధిక పరిస్థితి.
బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబసభ్యులు..
కనీసం ప్రభుత్వం కూడా సాయం చేయకపోవడంతో దీనస్థితిలో సాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబసభ్యులు..
అయితే ఎక్సైజ్ సీఐ స్వప్నకు గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని, అందుకే అనుభవం
లేని మహిళా కానిస్టేబుళ్లకు రాత్రి వేళల్లో డ్యూటీ వేస్తుందని సిబ్బంది ఆరోపణ..
వసూళ్లకు అడ్డు పడుతున్నామనే తమపై దాడులు చేయిస్తుందని ఆరోపిస్తున్న సిబ్బంది.. దీంతో నిజామాబాద్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన సిబ్బంది…
దీంతో సీఐ స్వప్న వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేశామని తెలిపిన నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి
కమిటీ నివేదిక వచ్చిన అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన సోమిరెడ్డి…
అసలేం జరిగిందంటే?
నిజామాబాద్ నగర శివారులో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక కారును గుర్తించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య.. దానిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూడగానే నిందితులు భయపడకుండా.. తప్పించుకునే క్రమంలో కారును నేరుగా సౌమ్యపైకి పోనిచ్చారు.
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో
కారు బలంగా ఢీకొట్టడంతో సౌమ్య గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సహచర సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను నిజామాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వెంటాడి పట్టుకున్న పోలీసులు
కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన తర్వాత నిందితులు కారులో వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఎక్సైజ్ పోలీసులు సినిమా ఫక్కీలో వారిని వెంబడించి పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు నిందితులను (ఒకరు మైనర్ అని సమాచారం) అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు మహమ్మద్ సొఫియొద్దీన్, సయ్యద్ షోయల్గా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరి వెనుక ఉన్న గంజాయి నెట్వర్క్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై ఇలాంటి దాడి జరగడంపై పోలీస్ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది..