Gold Price Today: రూ.2 లక్షలకు చేరువలో బంగారం ధర…
పసిడి ధరలు సామాన్యులను పరుగులు పెట్టిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం దుకాణాల వైపు వెళ్లాలంటే జంకుతున్నారు. బంగారం కొనాలన్న ఆలోచన వదులుకునేలా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి..
కామారెడ్డిలో బుధవారం రాత్రి వరకు తులం ధర రూ. 1,74,500 ఉన్న బంగారం.. గురువారం సాయంత్రానికి ఏకంగా రూ.11 వేలు పెరిగి రూ.1,85,500 కు చేరింది. తులం బంగారం ధర రూ. 2 లక్షలకు చేరడం ఎంతో దూరంలో లేదన్న చర్చ సాగుతోంది. ఒకప్పుడు పెళ్లిళ్ల సీజన్ వస్తే బంగారం దుకాణాలు కిటకిటలాడేవి. ప్రస్తుతం దుకాణాలు గిరాకీ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇక వెండి ధరలకు రెక్కలొచ్చాయి. గురువారం సాయంత్రం నాటికి బంగారంతో పాటు వెండి ధరలు పోటీపడ్డాయి. వెండి ధర రూ.4 లక్షలు దాటింది. దాంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు..