తిరువనంతపురం వేదికగా జరిగిన చివరి టీ20 పోరులో టీమిండియా అద్భుత విజయం….
బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ శతక్కొడితే,
బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు.
చివరి వికెట్‌ను ఫినిషర్ రింకూ సింగ్ తీయడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దీంతో న్యూజిలాండ్‌ను 46 పరుగుల తేడాతో ఓడించిన భారత్, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో ఘనంగా కైవసం చేసుకుంది..
టి20 మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించి విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేయడమే కాకుండా, న్యూజిలాండ్ ను కట్టడి చేసింది. ఈ తరుణంలోనే చిట్ట చివరి టీ20 మ్యాచ్ ఏకంగా 46 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇండియా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో విఫలమైన న్యూజిలాండ్, 19.4 ఓవర్లు ఆడి, 225 పరుగులు మాత్రమే సాధించి ఓడింది. ఈ తరుణంలోనే 4-1 తేడాతో 5 టీ20ల సిరీస్ కూడా కైవసం చేసుకుంది సూర్య కుమార్ యాదవ్ సేన. ఈ భారీ విజయంతో టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో అడుగుపెట్టనుంది టీమిండియా…దీంతో 46 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ చాలా ప్రమాదకరంగా ఈ మ్యాచ్ లో ఆడాడు. ఒకానొక సమయంలో అతడు మ్యాజిక్ గెలిపిస్తాడని కూడా అందరూ అంచనా వేసుకున్నారు. కేవలం 38 బంతులు వాడిన ఫిన్ అలెన్ 80 పరుగులు సాధించాడు. అయితే అతన్ని అక్షర్ పటేల్ అవుట్ చేయడం జరిగింది. దీంతో ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు.
ఐదు వికెట్లతో ఇరగదీసిన అర్షదీప్ సింగ్
న్యూజిలాండ్ పై జరిగిన ఐదవ టి20 మ్యాచ్ లో డేంజర్ బౌలర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదట భారీగా పరుగులు సమర్పించుకున్న అర్షదీప్ సింగ్, ఆ తర్వాత ఐదు వికెట్లు పడగొట్టగలిగాడు. నాలుగు ఓవర్లు వేసిన అర్షదీప్ సింగ్ 51 పరుగులు ఇవ్వడమే కాకుండా ఐదు వికెట్లు తీసి ఇండియాకు విజయాన్ని అందించాడు. దీంతో అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. అటు గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి అలాగే రింకు సింగ్ చెరో వికెట్ తీశారు..