అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్ జట్టు ను ఓడించి.. సెమీస్‌కు చేరిన భారత్

అండర్-19 ప్రపంచ కప్‌ సూపర్ సిక్సెస్‌ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 252 పరుగులకు అలౌటైంది. విజయం కోసం పాకిస్తాన్ 253పరుగుల టార్గెట్ ను చేధించాల్సి ఉంది…. కానీ టార్గెట్ చేదనలో చతికల పడ్డ పాకిస్తాన్ జట్టు..

అండర్ 19 వరల్డ్ కప్లో టీమిండియా వరుసగా ఆరోసారి సెమీస్కు చేరుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 1) బులవాయోలోని క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన మ్యాచులో పాకిస్తాన్పై భారత ఘన విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి దాయాది దేశాన్ని 58 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా 2025 అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ ఓటమికి టీమిండియా కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారు. సెమీస్ పోరులో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ తలపడనుంది.

మ్యాచ్ సాగింది ఇలా..
అండర్-19 ప్రపంచ కప్‌ సూపర్

సిక్సెస్‌ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతునన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 252 పరుగులకు అలౌటైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన యువ భారత్ 49.4ఓవర్లలో 252 పరుగులకు అలౌటైంది. భారత్ జట్టులో అత్యధికంగా వేదాంత్ త్రివేది (68; 98 బంతుల్లో, 2ఫోర్లు, 1సిక్స్) పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (30; 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఆరోన్ జార్జి (16), విహాన్ మల్హోత్రా (21; 43 బంతుల్లో) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఒక దశలో 7 ఓవర్లకు 46/0తో ఉన్న భారత్.. తర్వాత వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేటలో వెనుకబడింది. పాక్ బౌలర్లు మహ్మద్ సయ్యమ్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో నాలుగో బంతికి వైభవ్, చివరి బాల్‌కు ఆయూష్ మాత్రే డకౌటయ్యాడు.అబ్దుల్ సుభాన్‌ వేసిన తర్వాత ఓవర్‌లో తొలి బంతికే ఆరోన్ జార్జ్‌(16) కూడా ఔటయ్యాడు. దీంతో ఇండియా నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి 47/3తో కష్టాల్లో పడింది.

రెండు భాగస్వామ్యాలతో కోలుకున్న భారత్

తర్వాతా వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా(21) జంట నాలుగో వికెట్ కు 62పరుగులు జోడించి ఆదుకున్నారు. అభిజ్ఞాన్ కుందు (16) ఐదో వికెట్ గా వెనుతిరిగాడు. ఆరో వికెట్ గా 40.2ఓవర్లలో జట్టు స్కోర్ 182 వద్ద వేదాంత్ కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం ఆర్.ఎస్. అంబరీష్ (29), కనిష్క్ చౌహాన్ (35), ఖిలాన్ పటేల్ (21) విలువైన పరుగులు సాధించి జట్టు మెరుగైన స్కోర్ సాధించేలా పోరాడారు. కనిష్క్ చౌహాన్ , ఖిలాన్ పటేల్ జంట ఎనిమిదో వికెట్ కు 50పరుగులు జోడించారు. అబ్దుల్ సుభాన్ 49ఓవర్లో వారిద్దరిని ఔట్ చేయడంతో పాటు దీపేశ్ దేవేంద్రన్(1)ని రనౌట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ కు తెరపడింది..