జనసేన పార్టీకి తాను రాజీనామా చేయలేదని, కేవలం పదవి నుంచి మాత్రమే..బొలిశెట్టి సత్యనారాయణ..

విశాఖ: జనసేన పార్టీకి తాను రాజీనామా చేయలేదని, కేవలం పదవి నుంచి మాత్రమే వైదొలిగినట్లు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు.
తాను పర్యావరణానికి సంబంధించిన కేసు దాఖలు చేసిన నేపథ్యంలో, పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో దూరంగా ఉన్నట్లు తెలిపారు.
పరిశ్రమల కాలుష్యం కారణంగా పర్యావరణం తీవ్రంగా నష్టపోతుందని, ముఖ్యంగా ఉత్తర కోస్తా మరియు కాకినాడ ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. సముద్ర జీవవైవిధ్యం ధ్వంసమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.