తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి..మంత్రి బీఎల్‌ వర్మ..

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి..

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి శాసనసభ కార్యదర్శి నుంచి రెండు బిల్లులు వచ్చాయి..

రెండు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చాయన్న కేంద్రం..

తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంపై ప్రశ్నించిన ఎంపీ ఈటల రాజేందర్‌..

ప్రస్తుతం 2 బిల్లులు పరిశీలనలో ఉన్నాయని లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్‌ వర్మ.

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ఇప్పుడు కేంద్రం పరిధిలోకి చేరింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు , స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న స్థాయి నుండి 42 శాతం పెంచాలని రాష్ట్రాలు ప్రభుత్వం కనిపించే విధంగా, దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రదర్శించింది. లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, తెలంగాణ శాసనసభ కార్యదర్శి నుంచి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రెండు బిల్లులు కేంద్రానికి అందాయని స్పష్టం చేశారు. ఈ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్రం వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు.

రిజర్వేషన్ల శాతం పెంచడం అనేది రాజ్యాంగపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఈ రెండు బిల్లులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రపతి భవన్‌కు పంపడం జరిగింది. తెలంగాణలోని బీసీ వర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చే విధంగా ఉంది 42 శాతం కోట్లు అమలు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ఈ బిల్లులు పరిశీలనలో ఉన్నాయని, తదుపరి చర్యలు రాష్ట్రపతి ఆమోదంపై కొనసాగుతున్నాయని మంత్రి. ఈటల రాజేందర్ వేసిన ఈ ప్రశ్నతో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియపై రాష్ట్రంలో నెలకొన్న సందిగ్ధతకు కొంత తెరపడినట్లయింది. కేంద్రం తీసుకునే తదుపరి నిర్ణయం తెలంగాణలో బీసీ సామాజిక వర్గాల రాజకీయ , ఉపాధి భవిష్యత్తు ఉంది.