తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ …

తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో మొదలైన పోలింగ్

412 డివిజన్లు, 2569 వార్డుల్లో ఎన్నికలు చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‎లకు క్యూ కడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2,569 వార్డులు, 412 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు