*అత్యంత అవినీతి పరుడుగా మారుతున్న ఓటర్*

*అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును అపహాస్యం చేస్తున్న ప్రజలు*
*ఎన్నికలనగానే నాలుగు పార్టీల దగ్గర వసూలు చేసుకోవడానికి ఓటర్ స్లిప్పులను జిరాక్సులు తీయించి పెట్టుకుంటూ ఎక్కువ డబ్బిచ్చినోడిని గెలిపించి తక్కువ డబ్బిచ్చినోడిని ఓడిస్తున్నారు* అంటే *ఎక్కువ డబ్బు మీద తక్కువ డబ్బు ఓడుతుంది*
పని,సేవకు విలువ లేకుండా డబ్బుకు విలువ పెరిగి
*ఒకడు గెలిస్తే ముగ్గురు ఓడి అప్పుల పాలైతున్నారు*

ప్రజలకు ఓటు విలువ తెలవాలంటే
ఓట్లను రద్దు చేయాలి
ఎన్నికల స్థానంలో వేలం పాటలు నిర్వహించాలి
ఈ క్రింది విధంగా
1.గ్రామం లో వార్డు మెంబర్ కు మినిమం 2 లక్షలు
2.ఉప సర్పంచ్ పదవికి మినిమం 5 లక్షలు
3.సర్పంచ్ కు మినిమం 15 లక్షలు
4.ఎంపీటీసీ లకు మినిమం 10 లక్షలు
5.ఎంపీపీ కి మినిమం 50 లక్షలు రూపాయలు
6.జెడ్పీటీసీ కి మినిమం 40 లక్షలు
7.జెడ్ పీపీకి మినిమం 2 కోట్లు
8.వార్డు కౌన్సిలర్ కు మినిమం 20 లక్షలు
9.మునిసిపల్ చైర్మన్ కు మినిమం 3 కోట్లు
10.డివిజన్ కార్పోరేటర్ కు మినిమం 30 లక్షలు
11.కార్పోరేషన్ మేయర్ కు మినిమం 20 కోట్లు
12.ఎమ్మెల్యేకు మినిమం 20 కోట్లు
13.రాష్ట్ర మంత్రి పదవికి మినిమం 100 కోట్లు
14.రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి 1000 కోట్లు
15.గవర్నర్ పదవికి మినిమం 200 కోట్లు
16.ఎంపీకి మినిమం 50 కోట్లు
17.కేంద్ర మంత్రికి మినిమం 500 కోట్లు
18.ప్రధాన మంత్రి పదవికి మినిమం 30 వేల కోట్లు
19.రాష్ట్రపతి పదవికి మినిమం 2000 కోట్లు
పై విధమైన మినిమం ధరలతో సర్కారు వారి పాటగా ఎన్నికల సంఘం
*ఎన్నికలను రద్దు చేసి పదవులకు వేలం పాట పెట్టాలి*
*అప్పుడు ఎవడైతే ఎక్కువ పాడుకుంటాడో వానిదే పదవి,వానొక్కనివే డబ్బులు* మిగతా వాళ్ళంతా సేఫ్….
పెట్టుబడి దారుల పాలన రావాలి
వ్యాపార రీతిన పాలన సాగాలి
సంక్షేమ పథకాలు ఎత్తివేయాలి
ఖర్చు పెట్టిన డబ్బులను దర్జాగా వసూలు చేసుకునే విధంగా టాక్సులు పెంచాలి
నాకు ఇళ్ళు కావాలి
నాకు పెన్షన్ కావాలి
నాకు బడి కావాలి
నాకు ఆరోగ్య శ్రీ కావాలి అని అడిగే హక్కు ప్రజలకు లేకుండా చేయాలి

ఓటు విలువ తెలవని ప్రజలకు సంబంధం లేకుండా పదవుల పంపకాలు జరగాలి….
అప్పుడు ఎన్నికల కోడ్ బాధ ఉండదు….
పది పదిహేను రోజుల పాటు ప్రచార హోరు ఉండదు
మందు,విందు,మైకుల మోతలు,సభలలో నాయకుల రోత మాటలు ఏవీ ఉండవు..‌.. ప్రజల జీవనం యదావిధిగా ఏ పట్టింపూ లేకుండా సజావుగా సాగుతుంది….

నిన్నటి ఎన్నికల్లో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలు,ప్రజలు,నాయకులూ గెలవలేదు కేవలం డబ్బే గెలిచింది….
డబ్బే ఓడింది….
ఓటరు మాత్రం దిగజారిండు ….
ఓటర్ లు ఎన్నికల షెడ్యూల్ వచ్చే దాకా భారతీయుడులో కమల్ హాసన్ లా ఉంటారు, షెడ్యూల్ రాగానే అపరిచితుడు పైసాసురుడు రూపంలో చొరబడతారు…. పాశవికమైన తోడేళ్ళలా మారిపోతారు….
అభ్యర్థుల రక్తమాంసాలను పీక్క తింటారు….
మందు కావాలి,విందు కావాలి అన్నింటికీ మించి అయిదేళ్ల తన భవిష్యత్తు ను తాకట్టు పెడుతున్నందుకు డబ్బు కావాలి….
అభ్యర్థి గెలిచినోడైనా ఓడినోడైనా నాశనమై పోవాలి….
ఈ పరిస్థితుల్లో గెలిచినోడు డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తాడు….
ఓడినోడు ఆర్థికంగా చితికి పోయి రోడ్డున పడతాడు…. అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేయడంలో మహిళామణులు శీల్ రాకాసులుగా అవతారమెత్తుతున్నారు….
కానీ ఈ ఒరవడి సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు….
మంచి వారిని, నిజాయితీగా సేవ చేసే వారిని ఓడగొట్టుకుని లంగలను,రౌడీలను, పెట్టుబడి దారులను డబ్బులు తీసుకుని గెలిపించుకుని,వాడేం చేయడు,వీడేం చేయడు అని అత్యంత అవినీతి పరుడైన ఓటర్ మహాశయులు నీతి కబుర్లు చెప్పడమే కొసమెరుపు….

నాయకులు కాదు ప్రజలు దిగజారుస్తున్న రాజకీయాలలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఎన్నికల స్థానంలో వేలం పాటలు మొదలవ్వాలని ఆశిస్తున్నాం.