లవర్తో లాడ్జీకి వెళ్ళిన భార్య
పోలీసులతో వెళ్ళి పట్టుకున్న భర్త .
*ఉడాయించిన ప్రియుడు – ఉగ్రరూపం దాల్చిన భార్య*
ఓ వివాహిత మహిళ తన ప్రియుడితో కలిసి గడపడానికి లాడ్జీకి వెళ్ళింది. దీన్ని పసిగట్టిన ఆమె భర్త పోలీసుల సాయంతో లాడ్జీకి చేరుకుని వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో బిత్తర పోయిన ప్రియుడు బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి ఉడాయించగా సదరు వివాహిత మహిళ మాత్రం పూర్తిగా రివర్సైంది.
నా ప్రియుడితో నేను హ్యాపీగా ఉంటే నువ్వెందుకు వచ్చావ్? నువ్వసలు మనిషివేనా?? పోలీసులతో రావడానికి సిగ్గులేదా??? అంటూ భర్తను ఉతికి ఆరేసింది.
దీంతో కొంచెం రోషం పొడుచుకొచ్చిన భర్త అమాంతం ఆమెను కొట్టేందుకు చెయ్యెత్తాడు. దీంతో ఆమె వెంటనే, “చెయ్యి దించు.. లేకపోతే అన్నం తినేందుకు చేతులుండవ్.. అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. అంతటితో ఆగక మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గదమాయించి తన ఇష్ట ప్రకారం ఇక్కడకు వచ్చానని చెప్పింది. నువ్వుట్టి వేస్ట్ ఫెలోవి అని పోలీసుల ముందే మగడిని పలుచన చేసి మాట్లాడింది.