*మొదటి బ్యాటింగ్ సౌత్ ఆఫ్రికా..*
గ్రూప్ దశలో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా సూపర్-8 దశలో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా కూడా అజేయంగానే నిలిచింది. ఆ జట్టుకు కనీస పోటీ కూడా ఎదురుకాలేదు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఆ జట్టు సొంతం.
తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా బౌలింగ్‌కు సిద్ధమవుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్ స్టేడియం స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది. కొద్దిగా స్లోగా ఉండే పిచ్‌పై బంతి అంత సులభంగా బ్యాట్ మీదకు రాదు. స్పిన్ విభాగంలో సఫారీ జట్టు కంటే టీమిండియా కాస్త బలంగా కనబడుతోంది..