యువ యూటూబర్ కోమలి ఆత్మహత్య..

యువ యూటూబర్ కోమలి ఆత్మహత్య

హైదరాబాద్ – మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి

అయితే ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని.. ఏడాది క్రితం అఖిల్ రెడ్డి అనే వ్యక్తితో బ్రేకప్ కావడంతో, కోమలి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం..

ఆత్మహత్యకు కారణాలు..

యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. గత మూడేళ్లుగా తనకు పరిచయం ఉన్న యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఆమె ప్రేమలో ఉన్నారని, అయితే ఏడాది క్రితం బ్రేకప్ అయిందని తెలుస్తోంది. అఖిల్ రెడ్డితో ప్రేమ విఫలం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు ఆమె ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితోనైనా మాట్లాడిందా, అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ రెడ్డి ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.