పాకిస్తాన్ ఫైటర్ జెట్ ను కూల్చిన ఆఫ్ఘన్ మిలిటరీ.

పాకిస్తాన్ కు చెందిన యుద్ద విమానాన్ని కూల్చివేసినట్లు ఆప్ఘన్ మిలిటరీ కూల్చివేసింది..పైలట్ సజీవంగా మిలిటరీకి పట్టుబడ్డాడని ఆప్ఘన్ మిలిటరీ ప్రకటించింది,,,
తూర్పు ఆప్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ లోని యుద్ద విమానాన్ని కూల్చివేశారు. పైలట్ పారాచూట్ ద్వారా దిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

ఆఫ్ఘన్ సైన్యం ప్రకటన ప్రకారం..ఆ యుద్ధవిమానం గగనతలంలోనే లక్ష్యంగా చేసుకుని కూల్చేవేశారు. విమానం కూలే సమయంలో పైలట్ పారాచూట్ సాయంతో బయటకు దూకినట్లు తెలిపారు. భూమికి దిగిన వెంటనే అతడిని సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ సైనిక ప్రతినిధి వహిదుల్లా మొహ్మది ధృవీకరించారు. పైలట్ సజీవంగా పట్టుబడ్డాడని అన్నారు.

తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా స్థావరంగా ఉన్న కాబూల్, కాందహార్‌లపై శుక్రవారం పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. శనివారం మరోసారి తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ లో ఫైటర్ జెట్లు దాడులు చేశాయి. దీంతో పాక్ , ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

పాకిస్తాన్ ప్రభుత్వం మరియు దాని సైన్యం ఈ విమానాలు కూల్చివేత వార్తలను తోసిపుచ్చింది. తమ విమానాలు క్షేమంగా ఉన్నాయని, కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఇస్లామాబాద్ ప్రకటించింది. మరోవైపు, ఆఫ్ఘన్ సైనికులు పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై భారీ దాడులు చేశారు, సుమారు 40 మందికి పైగా పాక్ సైనికులను చంపినట్లు మరియు 15 కు పైగా సైనిక పోస్టులను స్వాధీనం చేసుకున్నారు చేసుకున్నట్లు ఆఫ్ఘన్ రక్షణ శాఖ ప్రకటించింది.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ పరిస్థితిని “బహిరంగ యుద్ధం”గా అభివర్ణించారు. సరిహద్దులోని డ్యూరాండ్ లైన్ వెంబడి ప్రస్తుతం భీకర పోరు సాగుతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరు దేశాల మధ్య 2025లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ పరిణామాలతో పూర్తిగా విచ్ఛిన్నమైంది.