టీటీడీ చైర్మన్‌ పదవికి బీఆర్‌ నాయుడు…..వెంటనే రాజీనామా చేయాలి.. వైసీపీ మాజీ మంత్రి ఆర్‌కె రోజా..

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం బీఆర్ నాయుడు వీడియోల వివాదం రాజకీయంగా రచ్చగా మారింది. ఇప్పటి వరకు తిరుమల లడ్డుపై వైసీపీ వర్సెస్ కూటమి మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఎప్పుడైతే బీఆర్ నాయుడు మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో బైటకొచ్చిందో అప్పటి నుంచి మరల రాజకీయాలు యూటర్న్ తీసుకున్నాయి..

ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌ పదవికి బీఆర్‌ నాయుడు( BR Naidu ) వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ మాజీ మంత్రి ఆర్‌కె రోజా ( RK Roja ) డిమాండ్‌ చేశారు. నగరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీటీడీ పదవికి నాయుడు అనర్హుడని ఆరోపించారు. ఆయన హయాంలో ఆవుల మరణాలు, తొక్కిసలాట ఘటనలు జరిగాయని అన్నారు..దేశంలో ఏ ఆలయ చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు ఇలా బయపటడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. బీఆర్‌ నాయుడికి మహిళలంటే గౌరవం లేదని వెల్లడించారు. నిజం ఉంటేనే ఇందు అనే మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు, మంత్రి నారా లోకేష్‌కు లేఖ ఎందుకు రాస్తుందని అన్నారు.

టీటీడీ చైర్మన్‌పై వచ్చిన వీడియోలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగినప్పటికీ మళ్లీ ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు అనవసరమని తెలిపారు.. అంతే కాకుండా టీటీడీ చైర్మన్‌పై ఓరెంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు..

మొత్తంగా రోజా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు బీఆర్ నాయుడు వీడియోలో ఉన్న బాధితురాలు తనపై ఫెక్ వీడియోలను క్రియేట్ చేసి వైరల్ చేశారని హైదరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ నాయుడు సైతం ఇవన్ని ఫెక్ అని, ఏఐతో క్రియేట్ చేసినవని కొట్టిపారేశారు…