కుటుంబ సమేతంగా కేసీఆర్ ను ఎర్రవెల్లి నివాసంలో కలసిన మల్లారెడ్డి..!

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు…

ఈ నెల 19న జరగనున్న తమ 50వ వివాహ వార్షికోత్సవ (గోల్డెన్ జూబ్లీ ) కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను మల్లారెడ్డి దంపతులు పార్టీ అధినేత కేసీఆర్ దంపతులకు అందజేశారు.

వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా మల్లారెడ్డి దంపతులకు కేసీఆర్, శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ని కలిసిన వారిలో మల్లారెడ్డి కోడలు డా. ప్రీతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నరు.