అన్ని మతాల ప్రజలు కలిసి మెలిసి అన్నదమ్ముల జీవించాలి … మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్..

మత సామరస్యానికి నిదర్శనంగా ఉస్మానియా మసీదులో ఇఫ్తార్ విందు.

హుజూర్‌నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు.. సామరస్యానికి ప్రతీకగా కార్యక్రమం

హుజూర్‌నగర్ పట్టణంలోని ఉస్మానియా మసీదులో ముస్లిం యువకులు ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఈ సందర్భంగా చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్రత, ఉపవాస దీక్షల ద్వారా మనుషుల్లో సహనం, సేవాభావం, సోదరభావం పెరుగుతాయని అన్నారు. ముస్లిం సోదరులు పాటిస్తున్న ఉపవాసాలు సమాజానికి ఐక్యత, శాంతి, పరస్పర గౌరవం అనే సందేశాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు…ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రేమ, సహనం, పరస్పర గౌరవాన్ని నేర్పే పవిత్రమైన నెల అని అన్నారు. ఇలాంటి ఇఫ్తార్ విందులు సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు…ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి శివరాం యాదవ్, మూడో వార్డు కౌన్సిలర్ సులువ చంద్రశేఖర్, 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ, 6వ వార్డు కౌన్సిలర్ శీలం శీను, ప్రజాప్రతినిధులు సయ్యద్ రఫీ, బాజీ ఉల్లా, షేక్ జానీ పాషా, మ్యారేజ్ బ్యూరో మజీద్, మొహమ్మద్ యాసిన్, అలీ రజాలి, బాబా షఫీ, అజార్, సోహెల్, గౌస్, సలీం, ముఖిద్, ఇమ్రాన్, సమీర్, సైఫ్, అయ్యుబ్, నాగుల్ మీరా, నసీర్, రషీద్ తదితరులు మరియు ముస్లిం యువకులు, నాయకులు పాల్గొన్నారు.