సుప్రీంకోర్టు ఆదేశాలతో.. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఎట్టకేలకు విచారణ పూర్తి చేసిన స్పీకర్ “గడ్డం ప్రసాద్”..!
సుప్రీంకోర్టు ఆదేశాలతో.. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఎట్టకేలకు విచారణ పూర్తి చేసిన స్పీకర్ “గడ్డం ప్రసాద్”..
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఈరోజు ఉదయం పది గంటలకు ప్రకటన చేయనున్న స్పీకర్..
గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించిన్న సంగతి అందరికీ తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసన సభ స్పీకర్ను ఆదేశించింది. తీర్పు వచ్చిన తర్వాత మూడు నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఏండ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్లో ఉంచడం సరికాదని తెలిపింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది.