తుమ్మడి హేట్టి బ్యారేజ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలి….మాజీ మంత్రి జీవన్ రెడ్డి..

తుమ్మడి హేట్టి బ్యారేజ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలి..

మేడిగడ్డ పునరుద్ధరించాలి..

తుమ్మడిహెట్టి కాంగ్రెస్ పార్టీ డ్రీమ్ ప్రాజెక్ట్..

త్రాగు, సాగు నీటితో పాటు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగం..

బడ్జెట్ లో రెండేళ్లలో 10,000 కోట్ల నిధులు కేటాయించాలి…

మాజీ మంత్రి జీవన్ రెడ్డి…

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఉత్తర తెలంగాణ సస్య శ్యామలం చెందేందుకు గోదావరి దిగువన వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకునేందుకు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కృషి చేశారు.

ప్రాణహిత నది నీటి హక్కును వినియోగించుకునేందుకు తుమ్మడి హేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టేందుకు
కాలువలు కూడా నిర్మించారు.

హైదరాబాద్, రంగారెడ్డి కి కూడా త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకునేందుకు ఎంతో అవసర.

తుమ్మడి హేటి వద్ద టెండర్ దశలోనే నిలిచిపోయింది.

2023 అక్టోబర్ లో 7వ బ్లాక్ వద్ద కుంగి పోవటంతో నీటిని తరలించే అవకాశం లేకుండా పోయింది.

మేడిగడ్డ అన్నారం, సుందిల్ల కు మరమ్మతులు చేపట్టాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ సంస్థ సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వమే మరమతు చేపట్టి కాంట్రాక్టర్ వద్ద రికవరీ చేయవ చ్చు.
అవసరమైతే క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టవచ్చు.

తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చింది.

తుమ్మడి హేట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపడుతామని రాహుల్ గాంధీ చెప్పారు.

152 మీటర్ల నీటిని తరలించేందుకు తవ్విన కాలువలు 148 మీటర్ల నీటిని తరలించేందుకు రీ డిజైన్ చేయవచ్చు.

జైపూర్ వాగు నుండి సుందిల్ల లిఫ్ట్ తో ఎల్లంపల్లి కి నీటిని తరలించవచ్చు.

తుమ్మడి హేట్టి బ్యారేజ్ నిర్మాణం, నీటి తరలింపు, కాలువల రీ డిజైన్ కు పదివేల కోట్లకు మించదు.

ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ముసి నది ప్రక్షాళనకు, హైదరాబాద్ వరంగల్, మెదక్, నల్గొండ సగం రాష్ట్రానికి ప్రాణహిత నది జలాలను వినియోగించుకోవడం..

రాష్ట్రానికి ఆయువుపట్టు గోదావరి, ప్రాణహిత నది జలాలు..

రెండేళ్లుగా ప్రకృతి సహకరించింది..
వర్షాభావ పరిస్థితుల లు ఏర్పడితే రాష్ట్రం త్రాగు నీరు, సాగు నీరు కు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

మేడిగడ్డ పునరుద్ధరణ, నిర్మాణ వైఫల్యమా.. నిర్వహణ లోపమా..ఏదైనా..మేడిగడ్డ పునరుద్ధరణ చేసి, వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.

తుమ్మడి హేట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రాధాన్యతతో నిధులు కేటాయించాలి..