ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరీ లకు ఊరట..బిఆర్ఎస్,బిజెపి పార్టీ లు వేసిన రెండు పిటిషన్లు డిస్మిస్ చేసిన స్పీకర్..

హైదరాబాద్:

ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరీ లకు ఊరట.

బిఆర్ఎస్,బిజెపి పార్టీ లు వేసిన రెండు పిటిషన్లు డిస్మిస్ చేసిన స్పీకర్

మొత్తం పదిమంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేసిన స్పీకర్

రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే ల అనర్హత పిటిషన్లపై విచారణ

సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఎట్టకేలకు విచారణ పూర్తి చేసిన స్పీకర్ “గడ్డం ప్రసాద్”

ఇరువర్గాల అడ్వకేట్ల వాదనలు విన్న స్పీకర్ టెక్నికల్ గా ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు సభ్యులు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు అన్న స్పీకర్

*ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్:*

స్పీకర్ పరిధిలో నేను ఎలాంటి తప్పు చేయలేదు

అసెంబ్లీలో బిఆర్ఎస్ నాకు ఎప్పుడు విప్ జారీ చేయలేదు

కేసీఆర్ నన్ను ఇంత వరకు వివరణ అడగలేదు

బీఆర్ఎస్ క్రమశిక్షణ కమిటీ సైతం నన్ను వివరణ తీసుకోలేదు

వైయస్సార్,కేసీఆర్ లు అంటే నాకు అభిమానం

నన్ను కేసీఆర్ ప్రశ్నించాలి కానీ కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం.?

నేను బీఆర్ఎస్ మెంబర్ షిప్ వదులుకోలేదు కొత్త మెంబర్షిప్ ఎక్కడ తీసుకోలేదు…

పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇచ్చారు. వారిద్దరూ పార్టీ మారినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు వారి అనర్హత వేటుపై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేశారు. వారిద్దరూ పార్టీ మారలేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తుది తీర్పు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందికి క్లీన్‌చీట్ వచ్చింది….