లవ్ జిహాద్’ విమర్శలపై మోనాలిసా గరం…!

సెన్సేషన్ మోనాలిసా, నిన్న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు ఫర్మాన్ ఖాన్ను ఆమె హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది…అయితే, ఈ పెళ్లిని ‘లవ్ జిహాద్’ అని కొందరు విమర్శిస్తుండటంతో మోనాలిసా ఘాటుగా స్పందించింది. తన వివాహానికి ‘లవ్ జిహాద్’ అని ముద్ర వేయవద్దని కోరింది. తనకు అన్ని మతాల పట్ల గౌరవం ఉందని స్పష్టం చేసింది..

కుంభ మేళాతో పాపులర్ అయిన మోనాలిసా పెళ్లి చేసుకుంది. ఫర్మాన్ ఖాన్ ను బుధవారం (మార్చి 12) కేరళ లో వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లిపై సనోజ్ శర్మ సంచలన పోస్ట్ పెట్టాడు. ఇది లవ్ జిహాద్ అని అతను మండిపడ్డాడు. కుంభమేళాతో ట్రెండ్ అయిన మోనాలిసాను హీరోయిన్ గా పెట్టి ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా సనోజ్ తీశాడు.

మానసిక ఆందోళన
”మోనాలిసా మళ్లీ వార్తల్లో నిలిచింది. కానీ నేను మాత్రం తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాను. మహాకుంభమేళాలో వైరల్ అయిన తర్వాత, అడవుల్లో నివసించే ఒక పేద అమ్మాయి తన నివాసమైన డేరా మహేశ్వర్‌కు వెళ్ళిపోయింది. గంగమ్మ లాంటి ఆమె పవిత్రత, ప్రకృతి సిద్ధమైన ఆమె రూపం నాకు నచ్చింది. ఆమెకు శిక్షణ ఇచ్చి, నా సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నా’’ అని సనోజ్ శర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో భారీ పోస్టు రాసుకొచ్చాడు..

లవ్ జిహాద్
”మోనాలిసా తన బాధను నాతో చెప్పుకుంటూ ఏడ్చేది. ఎప్పటికైనా అందరినీ ఎదిరించి తన తల్లి దగ్గరకు వెళ్తానని. నేను ఆమెకు సర్దిచెప్పేవాడిని. కానీ ఇస్లామిక్ శక్తులు నన్ను రేపిస్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో ఆమె వ్యక్తిగత విషయాల్లో మరీ ఎక్కువగా జోక్యం చేసుకోలేదు..